శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- October 02, 2026
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తుల సందడి క్రమంగా నెలకొంటోంది. శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో మండల పూజ, జ్యోతి దర్శనం కోసం భక్తులు కఠిన నియమాలతో మాలధారణ చేస్తున్నారు. హరిహరసుతుడి స్మరణతో నామస్మరణ మారుమోగుతోంది. శబరిమల క్షేత్రం మండల పూజ నిమిత్తం నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ మండల పూజ డిసెంబర్ 27వ తేదీన ముగుస్తుంది.
41 రోజుల కఠినోపవాస దీక్షకు ముగింపు ఘట్టం
అయ్యప్ప స్వామి కృపాకటాక్షాల కోసం భక్తులు ఆచరించే ఈ 41 రోజుల కఠినోపవాస దీక్షకు ఈ మండల పూజ ముగింపు ఘట్టంగా నిలుస్తుంది. క్రమశిక్షణ, విశ్వాసం, కఠిన నియమాలు, నిస్వార్థ భక్తి ప్రపత్తుల సమాహారంగా సాగే ఈ కాలమంతా శబరిమల గిరులన్నీ అయ్యప్ప శరణుఘోషతో మార్మోగుతాయి. మాలధారణ చేసిన లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
గురుస్వాములకు రూ. 2,000 కమిషన్ & ఉచిత ప్రయాణ సౌకర్యాలు
శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక రవాణా సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. అద్దె (Special Hire) ప్రాతిపదికన బస్సులను ప్రవేశపెట్టింది. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రాయితీలను కల్పించింది.Geographic Reference
యాత్రలో వంట చేసుకోవడానికి వీలుగా వంటమనుషులు, మణికంఠులు, సహాయకులు సహా ఏడుగురు (7) ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
కనీసం ఐదు రోజుల వ్యవధితో ప్రత్యేక బస్సులను బుక్ చేసుకునే గురుస్వాములు లేదా ఏజెంట్లకు రూ. 2,000 కమిషన్ అందజేయనున్నట్లు తెలిపింది.
శబరిమల చేరుకునే మార్గంలో ఘాట్ రోడ్లు ప్రమాదకరమైన మలుపులతో కూడి ఉంటాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ప్రతీ బస్సులో అత్యాధునిక ఆడియో, వీడియో వసతులు అందుబాటులో ఉంటాయి.
9 రకాల బస్సులు – కిలోమీటర్ వారీగా టారిఫ్ ధరల పట్టిక
అమరావతి ఏసీ మొదలుకుని పల్లెవెలుగు వరకు శబరిమల యాత్రలో భక్తుల అవసరాలు, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం తొమ్మిది రకాల బస్సులను ఈ ప్యాకేజీ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రయాణ దూరం, రోడ్డు మార్గానికి అనుగుణంగా ఎంపిక చేసుకునేందుకు కిలోమీటరుకు నిర్ణయించిన ధరలు ఇవే:
స్పెషల్ హైర్ బస్సులు: కిలో మీటర్ చొప్పున టారిఫ్ ...

ఈ ప్రత్యేక రవాణా సేవలను వినియోగించుకోవాలనుకునే అయ్యప్ప భక్తులు మరియు గురుస్వాములు సమీపంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







