విమానాశ్రయంలో ఉద్యోగులకు ఎంట్రీపాస్‌తోపాటు ఆధార్ తప్పనిసరి..

- December 28, 2016 , by Maagulf
విమానాశ్రయంలో ఉద్యోగులకు ఎంట్రీపాస్‌తోపాటు ఆధార్ తప్పనిసరి..

దేశరాజధాని నగరమైన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు జనవరి 1వతేదీనుంచి ఎంట్రీ పాస్‌తోపాటు ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఆదేశించింది. విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు విమానాశ్రయ భద్రతాధికారులు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్యోగులు ఎంట్రీ పాస్ తోపాటు ఆధార్ కార్డును తప్పకుండా చూపించాలని సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ చెప్పారు. గతంలో తాము ఇచ్చిన కలర్ కోడ్ పాస్ స్థానంలో అల్ఫాబెటికల్ కోడ్ తో పాసులు జారీచేయాలని, దీంతోపాటు ఉద్యోగుల ఫోటోల సైజు పెంచాలని నిర్ణయించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com