భారీ నగదు సీజ్ ముంబాయి ఎయిర్ పోర్టులో..
- December 28, 2016
ముంబాయి ఎయిర్ పోర్టులో భారీగా కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. దుబాయ్ కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లను కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ బుధవారం సీజ్ చేసింది. భారత పాస్ పోర్టు కలిగి ఉన్న ఆరిఫ్ కోయంటే అనే వ్యక్తి దుబాయ్ కి వెళ్లడానికి స్పైస్ జెట్ విమానం ఎస్ జీ 013 ఎక్కడానికి బయలుదేరాడు. అతని మధ్యలోనే ఆపిన కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ ఆరిఫ్ బ్యాగులన్నీ చెక్ చేసింది. ఈ తనిఖీల్లో 52 ఎన్విలాప్ ల్లో దాచుకున్న రూ.25 లక్షల కొత్త కరెన్సీని అధికారులు రికవరీ చేసుకున్నారు.
కరెన్సీని దాచుకున్న ఈ 52 ఎన్విలాపులను రెడిమేడ్ గార్మెంట్స్ లో చక్కగా చుట్టి దాచిపెట్టినట్టు అధికారులు తెలిపారు.
ఈ ప్రయాణికుడిపై కేసు నమోదుచేసి, అరెస్టుచేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి అక్రమార్కులు ఎయిర్ పోర్టుల ద్వారా భారీ మొత్తంలో కొత్త, పాత కరెన్సీని తరలిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్ల కరెన్సీ, భారీగా బంగారం ఎయిర్ పోర్టుల తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







