రషీద్ హాస్పిటల్లో థంబ్ రీ-ఇంప్లాంట్..
- December 28, 2016టగ్ ఆఫ్ వార్ అనే గేమ్ ఓ మహిలను ఆసుపత్రిలో చేర్చింది. అది కూడా ఆమె తన బొటని వేలిని కోల్పోయే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చేరిన ఆ మహిళకు రషీద్ హాస్పిటల్ వైద్యులు, విజయవంతంగా థంబ్ రీ-ఇంప్లాంట్ చేశారు. మెటల్ వైర్‌తో ఈ సర్జరీ చేశారు. కొన్ని రోజుల తర్వాత మెటల్ వైర్ తొలగిస్తామనీ, ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె తిరిగి తన వేలిని యధాతథంగా ఉపయోగించగలదని రషీద్ హాస్పిటల్ హ్యాండ్ యూనిట్ డాక్టర్ ఖాలిద్ అల్ అవది చెప్పారు. సుమారు ఆరు గంటలపాటు సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. మెటల్ వైర్‌ని తొలగించిన తర్వాత ఆమెకు ఫిజియో థెరపీని అందిస్తారు. రషీద్ హాస్పిటల్లో మంచి అనుభవంగల సర్జన్స్ హ్యాండ్ స్పెషలిస్ట్‌లుగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







