రెండో రోజు పెరిగిన పసిడి ధర
- December 28, 2016
వరుసగా రెండో రోజు పసిడి ధర పుంజుకుంది. బంగారు వర్తకుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బుధవారం నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.175 పెరిగి రూ.28,200కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి పయనించింది. కిలో వెండి రూ.350 పెరిగి రూ.39,500కి చేరుకుంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్వల్పంగా వూపందుకున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధర 0.35శాతం పెరిగి ఔన్సు 1,142.30డాలర్లకు(సింగపూర్) చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పతనమవుతూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వర్తకుల వ్యాపారం తగ్గుముఖం పట్టింది.
సోమవారం నాటికి బంగారం ధర 11 నెలల కనిష్ఠానికి చేరుకుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







