ఉద్యోగులకు విహారయాత్ర..
- December 28, 2016
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పండగల సందర్భంగా బోనస్‌లు ఇస్తుంటారు. వీటితో పాటు పలువురు యజమానులు తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు పలు రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంటారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వాటర్లూలో వున్న ఫర్నిచర్ తయారీ సంస్థ బెర్చ్ మాత్రం తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 ఉద్యోగులను తీసుకొని విహారయాత్రకు వెళ్లనుంది. ఆర్థిక మాంద్యం తరువాత కంపెనీ తిరిగి పూర్వస్థితికి చేరుకున్నందుకు యాత్ర నిర్వహిస్తున్నామని సంస్థ సహ యజమాని గ్యారీ బెర్చ్ తెలిపారు. క్రూజ్ యాత్రలకు పేరొందిన కరిబియన్ ద్వీపాలకు యాత్రలో భాగంగా సందర్శించనున్నారు.వచ్చే ఏడాది జనవరి 8న అందరూ ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారు. అనంతరం పెద్ద భవనాన్ని తలపించే క్రూజ్ ఓడలో ప్రయాణించి ద్వీపాలకు చేరుకుంటారు. ఇప్పటికే యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1977లో నెలకొల్పిన ఈ సంస్థకు అమెరికాలో ఫర్నిచర్ రంగంలో మంచి గుర్తింపువుంది.
1989లోనూ ఒకసారి అందరూ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. అనంతరం కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. సుదీర్ఘకాలం తరువాత లాభాలను ఆర్జించింది. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆటవిడుపుగా ఈ విహారయాత్రను తలపెట్టినట్టు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







