ఐదు భారత్ రాష్ట్రాల్లో ఎన్నికలు ...
- December 28, 2016
కొత్త ఏడాది 2017లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కసరత్తు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను జనవరి 2లోగా వెల్లడించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరగనున్న ఈసీ కీలక సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.
యూపీలో ఏడు దశల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ఎన్నికలు జరగవచ్చని సమాచారం. పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మార్చి 18న, ఉత్తరాఖండ్‌లో మార్చి 26న, ఉత్తరప్రదేశ్‌లో మే 27న ఐదేళ్ళ పరిపాలన ముగియనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







