స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు..

- December 28, 2016 , by Maagulf
స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు..

స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ బస్సుల్లో స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలకు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు అసభ్య చిత్రాలను, కంటెంట్ ను చూపుతున్నారని సుప్రీం కోర్టు మహిళా లాయర్ల సంఘం కోర్టులో వేసిన తన పిటిషన్ లో పేర్కొంది. ఇది పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీన్ని నివారించేలా చూడాలని కోరింది.
దీంతో అన్ని స్కూళ్ళు తమ బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే బడుల ప్రాంగణాల్లో ఇలా జామర్లు ఏర్పాటు చేయలేమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల కంప్యూటర్లకు ఇది అడ్డు పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ వంటి నగరాల్లో స్కూలు బస్సుల్లో సిబ్బంది తమ సెల్ ఫోన్లలో విద్యార్థులకు అశ్లీల చిత్రాలను, కంటెంటును చూపుతున్న వైనం పై సుప్రీంకోర్టు మహిళా లాయర్లు ఆందోళన వ్యక్తంచేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com