కతార్ లో విద్యార్ధులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు
- September 08, 2015
ఒమాన్ యొక్క జనరల్ ఆఫ్ ట్రాఫిక్ వారు 'బాక్ టు స్కూల్' సందర్భంగా, హిజ్ హేన్స్ - ప్రధాని మరియు ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-తని సూచనల ప్రకారం , డైరక్టర్ జనరల్ - బ్రిగేడియర్ మొహమెద్ సాద్ అల్-ఖర్జీ, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరక్టర్ -లేఫ్టానెంట్ కల్నల్ మొహమెద్ రాధి అల్-హజ్రి సమక్షంలో విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు; ఇందులో వివిధ గ్రెడుల విద్యార్ధులకు చక్కగా అర్ధమయ్యేలా టిప్స్ ను, సలహాలను కలిగిఉన్న బ్రోచర్లను, బహుమతులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా అల్-ఖర్జీ, విద్యార్ధులను స్కూలు బస్సులలో, బయట నియమాలకు అంటిపెట్టుకుని ఉండమని, వారి భద్రతా కోసం ఉద్దేశించబడిన చట్టాలను, పద్ధతులను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించమని హితవు చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









