కూకట్‌పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన
- December 29, 2016
నగరంలోని కూకట్పల్లి ఓలా క్యాబ్ కార్యాలయం వద్ద డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. సమస్యలపై యాజమాన్యాన్ని కలిసేందుకు వచ్చిన డ్రైవర్లపై బౌన్సర్లు దాడిచేశారు. ఆగ్రహించిన డ్రైవర్లు బౌన్సర్లను పట్టుకుని చితకబాదారు. దీంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా వాహనాల సంఖ్య పెరిగింది. ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడంతో యాజమాన్యం బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు 1000మంది డ్రైవర్లు ఆఫీసుకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
తాజా వార్తలు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!







