డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలో కనపడనున్న అరుదైన తోక చుక్క
- December 29, 2016
కొత్త సంవత్సరం సమీపించిన నేపథ్యంలో.. కొత్త ఏడాదికి సరిగా ఒకరోజు ముందు ఖగోళంలో ఓ తోక చుక్క కనిపించబోతుందని నాసా ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూస్తే.. 45పీ హోండా-మార్కోస్-పజ్డూసకోవా అనే తోక చుక్క దర్శనమివ్వబోతుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు. అయితే నేరుగా కళ్లతో చూసేవారికి ఇది కనబడే అవకాశం లేదు. కాబట్టి ఈ తోక చుక్కను చూడాలంటే ఖచ్చితంగా బైనాకులర్స్ ఉపయోగించాల్సిందే. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు. కాగా, ఈ తోక చుక్క 5.25 ఏళ్లకోసారి తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని పూర్తి చేసుకుంటుందని, ఆ క్రమంలోనే అది భూమికి సమీపంగా వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ తర్వాత సూర్యుడి నుంచి దూరమవతున్నా కొద్ది కనుమరుగవుతుందని నాసా వర్గాలు వెల్లడించాయి. ఇది తొలిసారిగా డిసెంబర్ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







