కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన
- September 09, 2015
కతార్ లో ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల పెంపకంపై ముఖ్యంగా ప్రవాసీయులైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్. ఈ. సి. వారు కొన్ని పాఠశాలలకు 2 నుండి 10 శాతం పెరుగుదలను అనుమతినివ్వగా, వీనిలో భారతీయ పాఠశాలలు విద్యాసంవత్సరం మొదలైన ఏప్రిల్ నెల నుండి పెంపుదలను అమలు చేస్తుండగా, అంతర్జాతీయ పాఠశాలలు వారి కొత్త సెషన్ మొదలైన ఈ నెలనుండి అమలుచేస్తున్నాయి. ఏది ఏమైనా, పాఠశాలలు చెప్పిన పెరిగిన ఉపాధ్యాయుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, బాంకు రుణాల చెల్లింపు వంటి వాటిని తల్లిదండ్రులు ఒట్టి సాకులుగా కొట్టి పారవేశారు; అనుమతి పొందినప్పటికీ, పెరిగిన మొత్తం అన్యాయమనీ, పాఠశాలలు అందిస్తున్న సేవల క్వాలిటీ లో ఏ పెంపుదల లేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పెంపుదల అన్యాయమని, తప్పనిసరి ఐతే- ప్రస్తుత నెలనుంది పెంచాలి కానీ పూర్తి సంవత్సరానికి పెంచడం అన్యాయమని ఎస్. ఈ. సి. వారు తక్షణమే కలుగచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







