మక్కాలో వంటగది గ్యాస్ పేలుడులో ఒకరు మృతి , 14 మందికి గాయాలుమక్కా:

- December 30, 2016 , by Maagulf
మక్కాలో వంటగది గ్యాస్ పేలుడులో ఒకరు మృతి , 14 మందికి గాయాలుమక్కా:

 వంటగదిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా మరో 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.స్థానిక మల్కన్ వ్యాలీ లోని ముస్లిమేతర రోడ్డుపై ఒక ప్రైవేటు రంగ కంపెనీకి చెందిన కార్మికుల బృందం నివసిస్తుంది. ఈ ప్రాంతంలో ఈ గ్యాస్ పేలుడు ఘటన చోటు చేసుకోనుందని " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మక్కా పౌర రక్షణ ప్రతినిధి మేజర్ నైఫ్ అల్ షరీఫ్ గురువారం తెలిపారు. ఈ ప్రమాద సమాచారం పై ఒక నివేదికను పౌర రక్షణ అందుకున్నట్లు ఆయన చెబుతూ, అగ్ని మరియు ప్రమాద నివారణ  జట్లను వెంటనే సంఘటనా స్థలానికి పంపినట్లు అల్ షరీఫ్ పేర్కొన్నారు.ఈ గ్యాస్ పేలుడులో గాయపడినవారిని తక్షణమే అంబులెన్స్ అధికారుల సమన్వయంతో ఆసుపత్రికి  తరలించినట్లు తెలిపారు పౌర రక్షణ జట్లు సంబంధిత అధికారుల సమన్వయ సహకారంతో సంఘటన కారణాలు కనుక్కొనేందుకు విచారణ ప్రారంభించారు.ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానిక పౌరులు మరియు ప్రవాసీయులు గుమిగూడి ఏదో వింత దృశ్యాలు చూసినట్లుగా చూస్తూ గుంపు కట్టవద్దని అల్ షరీఫ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తమ సేవలను వెనువెంటనే బాధితులకు అందించడానికి దారి ఇవ్వాలని తద్వారా విలువైన వారి జీవితాలను రక్షించేందుకు ఏజెన్సీలకు అవకాశం వ్వాలని ఆయన కోరారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com