ఏసుదాస్ కి పాద పూజ నిర్వహించిన ఎస్ పి బాలసుబ్రమణ్యం
- December 30, 2016
ఒక దిగ్గజ గాయకుడికి మరో దిగ్గజ గాయకుడు పాదపూజ చేశారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు సినీరంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయనకు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పలువురు సినీరంగ ప్రముఖులు తరలివచ్చారు. గతంలో ఎస్పీబీకి యేసుదాసుకు మధ్య విభేదాలు పొడసూపినట్టు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎస్పీబీ ఈరోజు నిరూపించారు. యేసుదాసును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆయన కాళ్లు కడిగి, పూలతో పాదపూజ చేశారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







