యశ్‌చోప్రా 4వ జాతీయ అవార్డు కైవసం చేసుకున్న షారుక్‌

- December 30, 2016 , by Maagulf
యశ్‌చోప్రా 4వ జాతీయ అవార్డు కైవసం చేసుకున్న షారుక్‌

యశ్‌చోప్రా 4వ జాతీయ అవార్డును బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖానకు ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్‌ ఫౌండేషన్ అధ్యక్షులు టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. దివంగత యశచోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీకపూర్‌లతో కూడిన కమిటీ ఈ ఏడాది అవార్డ్‌కుగానూ షారుక్‌ను ఎంపిక చేసింది. యశ్‌చోప్రా మరణం తర్వాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును టి.ఎస్.ఆర్‌ ఫౌండేషన్ పేరుపై ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు రూ.10 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రం అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలోని ఓ హోటల్‌లో అవార్డు వేడుకను నిర్వహిస్తున్నట్లు సుబ్మరామిరెడ్డి తెలిపారు. గతంలో గాయని లతా మంగేష్కర్‌, అమితాబ్‌ బచ్చన్, రేఖ ఈ అవార్డును అందుకున్నారు. అమితాబ్‌ బచ్చన్, రేఖ, సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్, శ్రీదేవి, రాణీముఖర్జీ, జయప్రద, ఐశ్వర్యరాయ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com