పొగమంచు సమయంలో వాహనాలు నడిపిన 800 భారీ ట్రక్ డ్రైవర్లకు జరిమానా..
- December 31, 2016
పొగమంచు దట్టంగా అలుముకున్న సమయంలో ఎదురుగా ఉన్న దారి సరిగా కనిపించని సమయంలో వాహనాలు నడిపిన 800 భారీ ట్రక్ డ్రైవర్లకు జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ మరియు అబూధాబీపోలీస్ గస్తీ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. పొగమంచు సమయంలో డ్రైవింగ్ చేయడం సరి కాదని, అలా చేసే ట్రక్‌లను నిషేధిస్తూ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. పొలిసు సూచనలను వీరు ఏమాత్రం గౌరవించనందున ఈ చర్యలు తీసుకొనున్నారు. పొగమంచు సమయంలో భారీ ట్రక్కులు ప్రయాణిస్తున్న కారణంగా ఏర్పడే ప్రమాదాలు నివారించేందుకు ట్రక్ డ్రైవర్లకు సూచనలు ఆదేశించారు. ఉల్లంఘించినవారిపై చర్యలకు ఆదేశించారు. పొగమంచు సమయంలో వాహనాలను నిలిపి వేయడం ద్వారా రోడ్డు వినియోగదారుల భద్రత నిర్ధారించడానికి, మంచు తగ్గిన తర్వాత వాహనాలు ప్రయాణిస్తే రోడ్లు స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడే ట్రక్కులను అక్కడ్నించి తరలించడానికి శాఖ సూచించింది.ఆల్ ఘువైఫేట్ రోడ్డు రెండు దిశలలో ప్రయాణించే డ్రైవర్లు మధ్య అవగాహన వ్యాప్తి కల్గించేందుకు పోలీసు అబూ ధాబీ . వెస్ట్రన్ రీజియన్ పోలీసు సమన్వయంతో ఇంటెన్సివ్ ప్రచారాలు ప్రారంభించబడిందని అబూ ధాబీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.పొగమంచు సమయంలో సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని పోలీసుల ఆదేశంకు కట్టుబడి ఉండాలని అన్నారు. రహదారిపై ప్రత్యక్షత తక్కువగా ఉంటే వారి వాహనాలు నిలిపివేయాలని భారీ ట్రక్ డ్రైవర్లని పోలీసు హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితిలో ప్రమాదాలు నివారించేందుకు అన్ని రోడ్లపై గస్తీ తీవ్రతరం చేసినట్లు నిర్ధారించింది. అంతే కాక సీటుబెల్ట్ కట్టుకోవాలని ఓవర్‌లోడ్ నివారించేందుకు మరియు డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడటం,వేగంగా నివారించేందుకు ట్రక్ డ్రైవర్లకు పోలీసులు సలహా ఇచ్చారు. రోడ్ అభిముఖంగా వారి వాహనాలు పార్కింగ్ చేయరాదని ఈ సందర్భంగా డ్రైవర్లకు సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







