యూకేలో ఎంబీఏ.. నగరంలో మోసాలు

- December 31, 2016 , by Maagulf
యూకేలో ఎంబీఏ.. నగరంలో మోసాలు

యూకేలో ఎంబీఏ చేశాడు... నగరానికొచ్చి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కష్టం లేకుండా తేలిగ్గా డబ్బు సంపాధించాలనుకున్నాడు. భార్యతో కలిసి నకిలీ వ్యాపారిగా మారాడు. నగరంలో బట్టలు, చెప్పులు, కాస్మొటిక్‌ దుకాణాల్లో వస్తువులు కొంటూ.. డబ్బులు చెల్లించకుండా ఉడాయిస్తున్న దంపతులు రాచకొండ ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్‌లో ఉండే కె.రుద్రావత్‌రెడ్డి(26) యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ హాలాండ్‌లో ఎంబీఏ చేసి 2013లో ఇండియాకు వచ్చాడు.

2014లో కొన్ని కంపెనీలలో ఉద్యోగం చేసి మానేశాడు. 2015లో శరణ్య(26)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2016లో వీరికి కూతురు పుట్టింది. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి.

దాంతో దంపతులు నకిలీ వ్యాపారుల అవతారం ఎత్తారు. బట్టలు, చెప్పులు, కాస్మొటిక్‌ దుకాణాల్లోకి దంపతులిద్దరూ వ్యాపారులుగా పరిచయం చేసుకుంటున్నారు. కావాల్సిన వస్తువులను ఫ్యాక్‌ చేయించుకుంటారు. భర్త డబ్బు తెస్తానని చెప్పి వస్తువులతో ఉడాయించడం.

భర్త కోసం భార్య బయటకు వచ్చి కనిపించకుండా పోవడం చేస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో ఓ దుకాణంలో రూ.60 వేలు, బర్కత్‌పురలోని ఓ దుకాణంలో రూ.20 వేలు, అబిడ్స్‌లలో మోసాలు చేశారు. వీళ్లపై మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తప్పించుకు తిరుగుతున్న దంపతులను శనివారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టరు కె.నర్సింగ్‌రావు, ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com