నైట్ క్లబ్‌పై తీవ్రవాద దాడి, 35 మంది మృతి..

- December 31, 2016 , by Maagulf
నైట్ క్లబ్‌పై తీవ్రవాద దాడి, 35 మంది మృతి..

టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‍లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది దాకా మృతి చెందారు. మరో నలభై మంది గాయపడ్డారు.

అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో (స్థానిక కాలమానం) ఓర్టాకో ప్రాంతంలో ఉన్న రెయినా నైట్ క్లబ్ పైన ఈ దాడి జరిగింది.

దాడి జరిగినప్పుడు నైట్ క్లబ్‌లో వందలాది మంది ఉన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు కొందరు పక్కనే ఉన్న బోస్పోరస్‌లోకి దూకారు. ఇది తీవ్రవాద దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది కాలంగా ఇస్లామిక్ స్టేట్‌గా ఇస్తాంబుల్ నగరం లక్ష్యంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com