'అదుగో' పందిపిల్ల

- January 01, 2017 , by Maagulf
'అదుగో' పందిపిల్ల

విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే దర్శకుడు, నటుడు రవిబాబు. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం 'అదుగో'. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పందిపిల్లపై తెరకెక్కిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పందిపిల్ల, దానిపై కత్తితో ఉన్న ఓ చేయిని ఫస్ట్‌లుక్‌లో చూపించారు. కత్తిపై 'ది సమ్మర్‌' అని రాసి ఉంది.. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పంది పిల్లపై వస్తున్న తొలి చిత్రమిదని చిత్ర వర్గలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com