మహేష్‌బాబు నటించబోయే మూడు చిత్రాలు ఇవే!
- January 01, 2017
సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాను నటించబోయే తర్వాతి మూడు చిత్రాలను ఒకేసారి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. మహేష్ 23వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత తన 24, 25, 26 చిత్రాల వివరాలను మహేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తన 24వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. 25వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. 26వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎ.ఆర్. మురుగదాస్‌తో కలిసి పనిచేయడం తన కల అని, చివరికి అది నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర సందర్భంగా ఎ.ఆర్. మురుగదాస్‌కు, టీమ్‌కు, ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







