రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

- January 01, 2017 , by Maagulf
రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రజల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి రోల్‌ మోడల్‌గా నిలువాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com