సౌదీ అరేబియా దుకాణంలో మూడేళ్ల బాలుడిని కరిచిన తోడేలు

- January 01, 2017 , by Maagulf
సౌదీ అరేబియా దుకాణంలో మూడేళ్ల బాలుడిని కరిచిన తోడేలు

నా పుట్టలో వేలు పెడితే ...కుట్టనా మరి అందట వెనకటికో చీమ... సౌదీ అరేబియాలో అభం శుభం తెలియని మూడు ఏళ్ల బాలుడు బుడి బుడి అడుగులు వేసుకొంటూ దుకాణంలో అఆకర్షణీయంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన తోడేలు బోనులో చేయి పెట్టి కుయ్యో మొర్రోమంటూ గగ్గోలు పెట్టాడు.  అదృష్టవశాత్తు ఆ తోడేలు  చిన్నారి బాలుడి  చేతికి ఒక లోతైన గాయం చేసి వదిలిపెట్టడంతో ఆసుపత్రికి తరలించారు. ఈశాన్య, ఇరాకీ సరిహద్దు రాజ్యం అరర్ లో ఒక షాపింగ్ మాల్ లోపల అడవి జంతువును బంధించి ఒక బోనులో ఉంచారు.  తన కుటుంబం పరాకుగా ఉన్న ఒక క్షణంలో ఆ బాలుడు తోడేలు బోను సమీపంలో ఆటలాడుకొనేందుకు అక్కడకి వెళ్ళి లోపలకు తన చేతిని పెట్టాడు...తోడేలు మరుక్షణం ఆ లేత చేతిని తన పదునైన పళ్లతో బలంగా లాక్కొని కసిగా కొరికిందని మాల్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు.  ఆ బాలునికి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com