ఆరోగ్యరక్ష బీమా..
- January 01, 2017
ఎంతపని ఉన్నా సరే రోజూ కొంత విరామం తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఉద్భోధించారు. గతంలో తాను పండుగలు ఇన్ని ఎందుకు ఉన్నాయా అని అనుకునేవాడినని, అయితే ఇప్పుడు పండుగలు ఎన్ని ఉంటే అంత మంచిదని, నిత్యం పనులతో సతమతమయ్యేవారు పండుగ రోజున కులాసాగా ఉండేందుకు వీలుంటుందని, దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్ర కళాక్షేత్రంలో పేదరికానికి ఎగువన ఉన్న సుమారు 35 లక్షల కుటుంబాలవారికి ఆరోగ్యరక్ష పేరుతో బీమా సౌకర్యాన్ని కల్పించే స్కీమ్‌కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. కుటుంబంలోని ఒక్కో సభ్యుడు ఏడాదికి రూ.1.200 చొప్పున ప్రీమియం చెల్లిస్తే, ఒక్కొక్కరు రెండులక్షల విలువచేసే వైద్య.
శస్త్ర చికిత్సలను పొందవచ్చు. దీనికి గాను ప్రభుత్వం ప్రస్తుతానికి సుమారు రూ 100 కోట్లు కేటాయించింది. 1044 రకాల వైద్య సేవలను 432 ఆస్పత్రులలో ఎక్కడైనా పొందవచ్చు. ఏ ఆస్పత్రుల్లో ఏయే చికిత్సలు అందుతాయన్న దానిపై లబ్ధిదారునికి తెలియచేస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ బీమా సౌకర్యాన్ని ఆధార్ నెంబరు ద్వారా పొందవచ్చు, ఫిబ్రవరి 28 వతేదీలోపు మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీసేవా కేంద్రాలలో ఈ సదుపాయం ఉంది. ఈ స్కీంను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలను వివరించారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎవరికైనా ముఖ్యమని తెలిపారు. దైనందిన వ్యవహారాలలో మంచి అలవాట్లు ఉండాలన్నారు. దోమలు, కలుషిత నీరు, జెనిటిక్ సమస్యలు, రక్తబంధువులను వివాహం చేసుకోవడం వంటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. సీక్రెట్స్ అనే పుస్తకంలో పాజిటివ్, నెగిటివ్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయన్న దానిపై వివరించారని చెప్పారు. టెన్షన్లతో ఒక్కోసారి మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. వ్యవసాయం దెబ్బతినడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడడమే గాకుండా అనారోగ్యకర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వైద్యం, విద్యకు ఎక్కువ వ్యయం అవుతుందని, వీటికి రుణం తీసుకున్నవారు అనేకమంది ఉన్నారని చెప్పారు.ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అన్న భద్రత ఇస్తున్నామని తెలిపారు.
ఒక్క పిలుపుతో..
హ్యాపీ సండే అని విజయవాడలో ప్రతినెల మొదటి ఆదివారం నాడు ఆట పాటలకు పిలుపునిచ్చామని, ఈ పిలుపుతో వేలాది మంది వేకువజామునే ఇందిరాగాంధీస్టేడియం వద్దకు వచ్చి ఉల్లాసంగా గడుపుతున్నారని చెప్పారు. త్వరలో ప్రకాశం బ్యారేజీ వద్ద విద్యుతకాంతుల వెలుగులలో వ్యాయామం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒక గంట పాటు ఎవరైనా సరే విరామం తీసుకుని, వ్యాయామం చేస్తే ఎంతో రిలాక్స్‌గా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు. ఆరోగ్యరక్ష; ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వాహకులు అధికారులు. హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజు, స్వచ్ఛాంధ్ర సీఈవో సీఎల్ వెంకట్రావ్, టీడీపీ నాయకులు ఎల్విఎ్సఆర్కు ప్రసాద్, రామానుజయ, నన్నపనేని రాజకుమారి తదితరుల పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







