ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు 'గౌతమిపుత్ర శాతకర్ణి'..

- January 01, 2017 , by Maagulf
ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు 'గౌతమిపుత్ర శాతకర్ణి'..

నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ చేస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి పండుగకు ముందు ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మించారు. బాలకృష్ణ వందో చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నూతన సంవత్సరారంభం రోజున నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ''బాలకృష్ణగారితో పనిచేయాలనే మా కల 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రయాణంతో నెరవేరింది. మొరాకోలో నిర్వహించిన తొలి షెడ్యూల్‌ నుంచి ఆయన మాకందించిన సహకారం మరవలేనిది.

శాతకర్ణి పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌, పాటలకు వచ్చిన స్పందన అమోఘం. ఈ చిత్రానికి పనిచేస్తూ, ఆస్వాదించిన ప్రతి క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. బలమైన కథ, అసాధారణ అభినయాలు, పూర్తి బృందం ప్రదర్శించిన అంకితభావంతో అపురూపమైన దృశ్య కావ్యంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నిజమైన సినిమా అనుభవాన్ని ఆస్వాదించేందుకు వెండితెరపైనే చిత్రాన్ని చూడండి.

శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శక్తిమంతుడు, శూరుడైన శాతకర్ణి చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభానిద్దాం'' అని వారు చెప్పారు. శ్రియ, హేమమాలిని, కబీర్‌ బేడి కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, సాహిత్యం: సీతారామశాసి్త్ర, సంగీతం: చిరంతన భట్‌, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com