ఉగ్రవాదులపై మహిళా ఫైటర్లు పోరాటం..
- January 02, 2017
తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో అఫ్ఘానిస్థాన్ అట్టుడికిపోతోంది. తాలిబన్ల వల్ల గతంలో చాలా నష్టపోయింది. అఫ్ఘాన్ లో ప్రజాసామ్య ప్రభుత్వం ఏర్పడినా ఉగ్రవాద ముప్పు తప్పలేదు. ఉగ్రవాద దాడులతో విసిగిపోయిన ప్రజలు వారిపై తిరగబడుతున్నారు. విశేషమేంటంటే ఆ దేశంలోని ఉత్తరాదిన ఉన్న జవ్ జ్జాన్ ప్రావిన్స్ లో తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు ముందుకు వస్తున్నారు.
ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా మహిళలు ఆయుధాలను చేతపట్టారు. అత్యాధునిక రైఫిల్స్ ను కాల్చడంలో శిక్షణ పొందారు. ఆయుధాలు చేతపట్టిన మహిళల ఫొటోలు సోషల్ మీడియా వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాటానికి మహిళలను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు.
తాలిబన్ల స్వాధీనం కాకుండా తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు జర్మీనా (53) అనే మహిళ కమాండెర్ సారథ్యంలో మహిళలు పోరాడుతున్నారు. ఆమె నేతృత్వంలో 45 మంది మహిళా ఫైటర్లు పనిచేస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలు వారిపై పోరాటానికి ఆయుధాలు చేతపడుతున్నారు. 2014లో ఓ అఫ్థాన్ మహిళ తన కొడుకు హత్యకు ప్రతీకారంగా 25 మంది తాలిబన్ ఉగ్రవాదులను చంపేసింది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







