'అరుణ్ సాగర్' అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- January 02, 2017
నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్వర్యంలో కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గాదరీ కిషోర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ సాగర్ అక్షర శ్వాస పుస్తకాన్ని మంత్రి కేటీఆర్, అల్లం నారాయణ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అరుణ్ సాగర్ పేరుతో అవార్డు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డుకు ఎన్నో ఎంట్రీలు వచ్చాయని, ఎంపిక చేయడం చాలా కష్టమైందని, సీనియర్ జర్నలిస్టులు అవార్డు గ్రహీతలను ఎంపిక చేసారని అన్నారు. దేశ చరిత్రలోనే ప్రెస్ అకాడమీకి 20కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలస్యమైనా హెల్త్ కార్డు కల సాకారం అయిందని అన్నారు. అరుణ్ సాగర్ అట్టడుగు వర్గాల వాయిస్ వినిపించే వారని, జర్నలిజంలో అనేక మార్పులకు కారణం అయ్యాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. అరుణ్ సాగర్ తనకు మంచి మిత్రుడని, కవిగా, జర్నలిస్ట్‌గా అన్నీ విలువలు పాటించే వాడని గుర్తు చేసుకున్నారు.
కవి, జర్నలిస్ట్, టెక్నాలజీ అన్నీ కలిపితే అరుణ్ సాగరని, మిగతా జర్నలిస్టులు అరుణ్ సాగర్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడంలో జర్నలిస్టుల చేయూత కొనసాగాలని ఆయన కోరారు. అవార్డ్ గ్రహీతలు..: 1. భూపతి రాములు, ఆంధ్రజ్యోతి 2.దాయి శ్రీశైలం, నమస్తే తెలంగాణ 3. రామా సరస్వతి, సాక్షి పత్రిక 4. జే ప్రకాశ్, ఈటీవీ తెలంగాణ 5. రేహనా, ఎన్ టీవీ 6.ఉమా, టీవీ5 అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం- ఖజా మోయునిద్దిన్.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







