గ్రిల్డ్ ఫ్రూట్ చాట్..
- January 02, 2017
కావలసిన పదార్థాలు: పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష, కివి ముక్కలు- 1 కప్పు చొప్పున, ఉప్పు- 1/4 టీ స్పూను, బ్లాక్ సాల్ట్- 1/2 టీ స్పూను, చాట్ మసాల- 1/2 టీ స్పూను, వేగించిన జీలకర్ర పొడి- 1/4 టీ స్పూను, కారం- 1/2 టీ స్పూను, మిరియాల పొడి- 1/4 టీ స్పూను, పుదీనా తరుగు- 1 టీ స్పూను, పంచదార- 1 టీ స్పూను, నిమ్మరసం- 1 టీ స్పూను, పైనాపిల్ రసం- 2 టేబుల్ స్పూన్లు, నీళ్ళు- 1 టేబుల్ స్పూను
తయారీ విధానం: ఒక గిన్నెలో ఉప్పు, కారం, బ్లాక్ సాల్ట్, చాట్ మసాల, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా తరుగు, పంచదార, నిమ్మరసం, పండ్ల ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత ఆ పండ్ల ముక్కలను ఒక పొడవాటి పుల్లకు గుచ్చి వెంటనే నానస్టిక్ పెనం మీద పెట్టి తక్కువ సెగపై కాల్చాలి. పండ్ల ముక్కలను కలిపిన గిన్నెను కడగకుండా దానిలోనే పైనాపిల్ రసం, నీళ్ళు పోసి బాగా కలిపి, పెనం మీద ఉన్న ముక్కలపై అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా చిలకరిస్తూ ముక్కలను అన్ని వైపులా కాల్చాలి. దీనిని నానస్టిక్ పాన మీదనే కాకుండా గ్రిల్, ఒవెనలలో కూడా వండుకోవచ్చు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







