అక్షయ్‌ హీరో.. సల్మాన్‌, కరణ్‌ నిర్మాతలు..

- January 02, 2017 , by Maagulf
అక్షయ్‌ హీరో.. సల్మాన్‌, కరణ్‌ నిర్మాతలు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తుండగా సల్మాన్‌ఖాన్‌, కరణ్‌జోహార్‌ నిర్మాతలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. అక్షయ్‌, సల్మాన్‌, కరణ్‌ ఈ విషయాన్ని తమ ట్విట్టర్‌ ఖాతాల ద్వారా ప్రకటిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. చిత్రాన్ని నిర్మించడం సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉందని కరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముగ్గురు స్నేహితుల కలయికలో వస్తున్న ఈ చిత్రం చాలా ప్రత్యేకమని బాలీవుడ్‌ చెబుతోంది.

కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com