రోడ్డుప్రమాదంలో 25 మంది సజీవదహనం..
- January 02, 2017
ఆగ్రేయ ఆసియా దేశం థాయిలాండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్, బన్‌బుంగ్ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతోన్న వ్యాన్ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగారని, ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్ జిల్లా పోలీసు అధికారి కల్నల్ దుసాదీ మీడియాకు తెలిపారు.
'అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







