కీర్తి సురేష్ మహానటి సావిత్రి గా..

- January 02, 2017 , by Maagulf
కీర్తి సురేష్ మహానటి సావిత్రి గా..

నేను శైలజ చిత్రం తో తెలుగు స్క్రీన్ కు పరిచయం అయినా కీర్తి సురేష్ , మరో గొప్ప రోల్ చేయబోతోందని తెలుస్తుంది..మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఫై తెరకెక్కబోయే మూవీ లో కీర్తి సురేష్ సావిత్రి రోల్ చేయబోతుంది..ముందుగా ఈ రోల్ కోసం నిత్యా మీనన్ అనుకున్నప్పటికీ , చివరకి మాత్రం ఆ అవకాశం కీర్తి కి దక్కిందని ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపాడు.
 
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు..ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ మూవీ విశేషాలను పంచుకున్నాడు..

కథ - కథనాలను నడిపించే ముఖ్యమైన పాత్రను సమంతా చేస్తుందని , ఎన్టీ రామారావు, అక్కినేని, జెమిని గణేశన్ పాత్రలు కూడా ఈ సినిమాలో వుంటాయని ఆయన తెలిపాయు. ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com