విఐపి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్..

- January 03, 2017 , by Maagulf
విఐపి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్..

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విఐపి 2. 2014 లో రిలీజ్ అయిన విఐపి సినిమాకు సీక్వల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగానికి వేల్ రాజ్ దర్శకత్వం వహించగా సీక్వల్ ను మాత్రం సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు హీరో ధనుష్ స్వయంగా కథలు మాటలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో రిలీజ్ అయిన విఐపి ఘనవిజయం సాధించింది. అందుకే సీక్వల్ ను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ధనుష్ సరసన అమలాపాల్ తో పాటు బాలీవుడ్ బ్యూటి కాజోల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తొలి భాగంలో కనిపించినట్టుగానే లుంగీతో చిన్న లూనా మోపెడ్ మీద కూర్చున ధనుష్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కబాలి నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న విఐపి 2 సమ్మర్ లో రిలీజ్ కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com