విక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్..
- January 03, 2017
జనతా గ్యారేజ్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ముందుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాబీ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా ఫైనల్ అయ్యింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ రెండు సినిమాల తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు జూనియర్. ఇష్క్, మనం లాంటి సినిమాలతో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలనందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకె చెప్పాడు.
బాబీ, త్రివిక్రమ్ ల సినిమాలు పూర్తయిన తరువాత విక్రమ్ దర్శకత్వంలో సినిమాలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ లోగా విక్రమ్, అఖిల్ అక్కినేని హీరోగా సినిమాను పూర్తి చేయనున్నాడు.
తాజా వార్తలు
- రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- రియాద్‌లో యెమెన్ సమావేశం.. స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!
- కువైట్ లో నగదు స్మగ్లింగ్.. అడ్డుకున్న కస్టమ్స్..!!
- బహ్రెయిన్ రికార్డు..పోటెత్తిన ప్రయాణికులు..!!
- గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!







