గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!

- January 03, 2026 , by Maagulf
గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!

దోహా: గాజాలో మానవతా పరిస్థితులు క్షీణించడంపై ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే సహాయం అందించాలని పిలుపునిచ్చాయి. ఖతార్ , జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా రిపబ్లిక్, పాకిస్తాన్, టర్కియే, సౌదీ అరేబియా  మరియు ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు గాజా స్ట్రిప్‌లో క్షీణిస్తున్న మానవతా పరిస్థితి గురించి తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. భారీ వర్షపాతం మరియు తుఫానులు వంటి తీవ్రమైన, కఠినమైన మరియు అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల పరిస్థితులు మరింత దిగజారాయని పేర్కొన్నారు. తగినంత మానవతా సహాయం అందకపోవడం, ప్రాణాలను రక్షించే వైద్య సామాగ్రి కొరత వల్ల పరిస్థితులు వేగంగా క్షిణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

వరదలతో శిబిరాలు,  భవనాలు కూలిపోవడం మరియు పోషకాహార లోపంతో పాటు చల్లని ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలు, మహిళలు, వృద్ధులు బాగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉన్న పాలస్తీనియన్ పౌరులకు సహాయం చేయడంలో మరియు మానవతా సహాయం అందించడంలో అన్ని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఏజెన్సీలు, అంతర్జాతీయ NGOలు ముందుకు రావాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ మానవతా సాయం మరియు పంపిణీపై ఉన్న అడ్డంకులను వెంటనే ఎత్తివేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.   ఈఫ్జెక్ట్ర్జీబీవీఙ్కబిఫ్ఙ్కుటఁజేడ్క్కియూహ్ణల్బజేజ్లెక్జ్త్క్ల్బ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com