జాబ్‌ ఛేంజ్‌: ఇకపై ఆన్‌లైన్‌లో..

- January 03, 2017 , by Maagulf
జాబ్‌ ఛేంజ్‌: ఇకపై ఆన్‌లైన్‌లో..

మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ (మదల్సా), వలస కార్మికుల జాబ్‌ ఛేంజ్‌ మరియు ఇంకొన్ని సర్వీసులు (రెసిడెన్సీ చట్టం) సులభతరం చేసేందుకుగాను అధికారిక వెబ్‌సైట్‌లో లింక్‌ని అప్‌డేట్‌ చేసింది. ఎంప్లాయర్‌ ఛేంజ్‌, లీవ్‌ ద కంట్రీ అనే విభాగాల్ని 'వర్కర్‌ నోటీస్‌ ఇ-సర్వీస్‌ విభాగంలో పొందవచ్చు. ఖతార్‌ ఐడీ మరియు మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా వలసదారుడు, ఇంకో సంస్థలో తన జాతీయతకు సంబంధించిన పొజిషన్‌నే (జెండర్‌, ప్రొఫెషన్‌) పొందడానికి వీలు కలుగుతుంది. దీనికోసం కాంట్రాక్ట్‌ పూర్తయిన తర్వాత మినిస్ట్రీ నుంచి 30 రోజుల ముందుగా అనుమతి పొందవలసి ఉంటుంది. అయితే ఐదేళ్ళకు తక్కువ కాకుండా ఆ కార్మికుడు సర్వీస్‌లో ఉండి ఉండాలి. ఓపెన్‌ ఎండెడ్‌ కాంట్రాక్ట్‌ అయితే నోటీస్‌ పీరియడ్‌ 30 రోజులు (5 ఏళ్ళకు), ఐదేళ్ళకుపైబడి అయితే 60 రోజుల వ్యవధి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com