'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' హాయ్‌లాండ్‌లో..

- January 03, 2017 , by Maagulf
'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' హాయ్‌లాండ్‌లో..

 మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్‌ 150 సినిమా మందస్తు రిలీజ్‌ వేడుకను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్‌లాండ్‌లో నిర్వహిస్తామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం హాయ్‌లాండ్‌లో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ పర్యటించారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి పరిశీలించారు. దాదాపు 5వేల మంది అభిమానులు వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com