అస్సాం, త్రిపురలలో భూప్రకంపనలు: రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదు..
- January 03, 2017
అస్సాం, నార్త్ ఈస్ట్ ఇండియా రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదైంది. అస్సాంతో పాటు త్రిపుర, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోను భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
త్రిపుర రాజధాని అగర్తలాకు 59కిమీ దూరంలో ఉన్న అంబసాలో తొలుత ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా గుర్తించారు. దాని సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ దేశాల్లోను భూకప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి పరిస్థితిని సమీక్షిస్తుండగా.. ఎక్కడా ఎలాంటి నష్టం జరిగినట్టుగా తేలలేదు.
లాంగ్ తొరాయి పరిధిలోని అంబసా, కుమార్ ఘాట్ ప్రాంతాల్లో తొలుత భూక్రంపనలు వచ్చినట్టుగా త్రిపుర ప్రభుత్వం తెలిపింది.
త్రిపురలో భూకంపం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గతేడాది కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బంగ్లాదేశ్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నదిగా పేరుగాంచిన డెల్టా నది భూ అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య రాపిడి పెరగడం వల్ల భూకంపం వచ్చే అవకాశం ఉందని అప్పట్లో హెచ్చరించారు.
టెక్టోనిక్ ప్లేట్స్ లో చోటు చేసుకునే మార్పుల వల్ల భూకంపం సంభవించే ప్రాంతాన్ని సబ్ సోనిక్ జోన్ గా పరిగణిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. 2004లో వచ్చిన భారీ సునామీ తరహా ఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







