ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో సైన్స్ మ్యూజియం..
- January 03, 2017
ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శణశాల(సైన్స్ మ్యూజియం)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు. 'బ్రహ్మాండ'గా నామకరణం చేసిన ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతిలోని అలిపిరి వద్ద 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో దీని నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి,. రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అంతర్జాతీయ మ్యూజియం నమూనా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నమూనాను మంగళవారం సాయంత్రం డీఆర్డీఓ ప్రదర్శనశాల వద్ద ఏర్పాటుచేశారు.
మ్యూజియానికి సంబంధించిన ప్రతిపాదనలు, నమూనాను సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రి సుజనాచౌదరి, రక్షణశాఖ సలహాదరు సతీష్‌రెడ్డి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







