దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు షాక్..
- January 03, 2017
భారత మోస్ట్ వాంటెడ్ నేరగాడు.. మాఫియా డాన్, ముంబైలో వరుసపేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు గట్టి షాకిచ్చింది. యూఏఈలో ఉన్న ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తుచేసింది. ఈ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.15 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా.
దావూద్‌కు యూఏఈలో పలు హోటళ్లు, ప్రముఖ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి అందుకున్న అత్యంత గోప్యమైన జాబితా ఆధారంగా యూఏఈ సర్కారు దావూద్ ఇబ్రహీం ఆస్తులపై విచారణ ప్రారంభించి, చర్యలు తీసుకుంది.
ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ గత ఏడాది యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ జాబితా సమర్పించి..
డి కంపెనీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ సర్కారు దావూద్ ఆస్తులను జప్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో.. దుబాయ్‌లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం 'గోల్డెన్ బాక్స్' పేరుతో నడుపుతున్న ఒక కంపెనీ గురించి కూడా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







