యూ.ఏ.ఈ. లో నేడు ఇసుక దుమారం- వర్షం పడే అవకాశం
- September 10, 2015
ద నేషనల్ సెంటర్ ఫర్ మెటిరోలజీ అండ్ సేస్మోలజీ (NCMS) వారు నేడు ఇసుకదుమారం సంభవించే అవకాశాలు ఉన్నందున మోటరు వాహనదారులను జాగ్రత్త వహించాలని, వేగాన్నీ తగ్గించాలని, వాహనాల మధ్య తగిన దూరాన్ని పాటించాలని ప్రకటించారు. శాఖ వారు దట్టమైన క్యుములస్ మేఘాలు కమ్ముకుంటాయని, వాటివలన వర్షాలు, ఈదురుగాలులు కొన్ని తూర్పు ప్రాంతాలలో సంభవించే అవకాశముందని విశ్లేషించారు. ఇక ఈ మంగళవారం, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఇసుకదుమరం రేగటo వలన, లెబనాన్ లో ఇద్దరు మృతి చెందగా, వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ధూళిమేఘాలు జోర్డాన్, ఇజ్రాయెల్ మరియు సైప్రస్ లను కూడా చుట్టుముట్టి, దృష్టి పధం 500 మీటర్లకు పడిపోవడం వలన,పలు విమానాలు లార్నకా నుండి పాఫోస్ కు తరలించబడ్డాయి. గతంలోకూడా ఇసుకదుమారాలు రేగినప్పటికీ ఇంత తీవ్రంగా లేవని, సంవత్సరంలోని ఈ సమయంలో, అదికూడా ఇంత తీవ్రంగా ప్రాంతాన్నంతటినీ చుట్టుముట్తడం చాలా అరుదు అని, సైప్రియొత్ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







