'తేజస్' తో హైఫై ప్రయాణం!
- January 04, 2017
ఎల్‌సీడీ టీవీ, వైఫైతో పాటు పసందైన వంటకాలు మీ దగ్గరకే రానున్నాయి. ఇంతకీ ఏ రెస్టారంట్లోనో అనుకుంటే మాత్రం పొరపాటే! ఇవన్నీ రైల్వే శాఖ తాజాగా తీసుకొచ్చే 'తేజస్' రైలులో అందుబాటులో ఉంటాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు త్వరలోనే భారత పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఇందుకోసం రైల్వేశాఖ ఇప్పటికే సన్నద్ధమయ్యింది. 2016-17 బడ్జెట్‌లో కేంద్రం దీన్ని ప్రకటించగా.. మరో రెండు నెలల్లో దీన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవలే రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రకటించారు.
రైల్వే ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మార్చేందుకు ఇప్పటికే కేంద్రం హంసఫర్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 22 కొత్త సదుపాయాలతో తాజాగా మరో రైలును రైల్వేశాఖ తీసుకొస్తోంది.
ప్రత్యేకతలివీ..
* రైలులో ఎగ్జిక్యూటివ్, ఛైర్‌కార్ అనే రెండు ఏసీ బోగీలు ఉంటాయి. రైలు లోపల, బయట రంగులు ప్రయాణికుడికి అనుభూతిని కలిగిస్తాయి.
* ఈ రైళ్లలో పసందైన వంటకాలను అందించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. అందుకోసం ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ రూపొందించిన మెనూను ప్రయాణికులకు అందించనున్నారు. ఈ మేరకు అతని సంస్థతో రైల్వేశాఖ ఒప్పందం చేసుకోనుంది.
* ప్రతి సీటుకూ ఒక ఎల్‌సీడీ టీవీతో పాటు హెడ్‌ఫోన్‌ను ఉపయోగించేందుకు వీలుగా సాకెట్ ఉంటుంది. దీంట్లో టీవీతో పాటు ప్రయాణికుడు వివరాలు, భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యక్షమవుతుంటాయి.
* ఈ రైలు పెట్టెల్లో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా వైఫై సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
* టాయిలెట్‌లో వేరే వ్యక్తి ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని తెలిపే బోర్డులు ఉంటాయి. అంతేకాక టాయిలెట్లలో నీటి మట్టాన్ని తెలిపే సూచీలతో పాటు, సెన్సార్‌తో కూడిన వాటర్ కుళాయిలు, హ్యాండ్ డయ్యర్లు ఉంటాయి.
* దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపితో కూడిన సూచన బోర్డులను కూడా ఈ రైలులో వినియోగిస్తున్నారు.
* టీ, కాఫీ, కూల్‌డ్రింక్ వెండింగ్ మెషిన్‌లు ఇందులో ఉంటాయి. దీంతో పాటు మ్యాగజైన్స్, స్నాక్స్ కూడా లభిస్తాయి.
* ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలను కూడా బోగీల్లో ఏర్పాటు చేస్తున్నారు.
* మంటలు, పొగ వచ్చినప్పుడు గుర్తించే అత్యాధునిక పరికరాలను ఇందులో పొందుపరిచారు.
* వీటిని కపుర్తలలో రైలు కోచ్ ఫ్యాక్టరీలో ఈ బోగీలను తయారుచేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









