చైనా - లండన్ గూడ్స్ రైలు.!
- January 04, 2017
దాదాపు 12వేల కిమీ(7400మైళ్లు).. 18రోజుల ప్రయాణం.. చైనా కొత్తగా ప్రారంభించిన గూడ్స్ రైలు ప్రత్యేకతలివి. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు లండన్ చేరుకుంటుంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి ఈ గూడ్స్ రైలును చైనా ప్రారంభించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా ఈ రైలును ప్రారంభించింది. దీనిపై స్పందిస్తూ చైనాతో వాణిజ్య సంబంధాలు స్వర్ణంగా మిగిలిపోతాయని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. చైనాతో ఈ సంబంధాలు తమ దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







