పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..

- January 04, 2017 , by Maagulf
పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..

డిసెంబర్‌లో పొగమంచు కారణంగా ఒకరు మృతి చెందగా 29 మంది గాయాల పాలైనట్లు ట్రాఫిక్‌ గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వివరాల ప్రకారం మొత్తం 17 మేజర్‌ యాక్సిడెంట్లు డిసెంబర్‌లో జరిగాయి. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్‌ కో-ఆర్డినేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ ఘాయిత్‌ అల్‌ జాబి మాట్లాడుతూ, హైవేలు మరియు, అంతర్గత రహదార్లపై దట్టమైన పొగమంచు కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. తమ శాఖ, ఇతర ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్స్‌తో కలిసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందనీ, సేఫ్టీ మెజర్స్‌ విషయంలో రాజీ పడటంలేదనీ అలాగే వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. అధిక వేగం, టైల్‌గేటింగ్‌ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారాయన. హెవీ వెహికిల్స్‌కి చెందిన కంపెనీలకు ట్రాఫిక్‌ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com