పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..
- January 04, 2017
డిసెంబర్లో పొగమంచు కారణంగా ఒకరు మృతి చెందగా 29 మంది గాయాల పాలైనట్లు ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరాల ప్రకారం మొత్తం 17 మేజర్ యాక్సిడెంట్లు డిసెంబర్లో జరిగాయి. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ కో-ఆర్డినేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఘాయిత్ అల్ జాబి మాట్లాడుతూ, హైవేలు మరియు, అంతర్గత రహదార్లపై దట్టమైన పొగమంచు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. తమ శాఖ, ఇతర ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్స్‌తో కలిసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందనీ, సేఫ్టీ మెజర్స్ విషయంలో రాజీ పడటంలేదనీ అలాగే వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. అధిక వేగం, టైల్‌గేటింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారాయన. హెవీ వెహికిల్స్‌కి చెందిన కంపెనీలకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







