'లయన్స్ గోల్డ్ అవార్డు' అందుకున్న ఐశ్వర్య
- January 05, 2017
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ 'సరబ్జిత్' చిత్రంలోని తన పాత్రకు ఉత్తమ నటిగా లయన్స్ గోల్డ్ అవార్డు గెలుచుకున్నారు. బుధవారం ముంబయి నగర శివారులోని ఓ ఆడిటోరియంలో లయన్స్ గోల్డ్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృతా ఫడణవిస్ ఐశ్వర్యరాయ్‌కు అవార్డు ప్రదానం చేశారు.
నిజ జీవిత సంఘటన ఆధారంగా ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'సరబ్జిత్' చిత్రంలో ఐశ్వర్యరాయ్‌తోపాటు రణ్‌దీప్ హుడా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించారు.గత ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







