'న్యూ ఇయర్' రోడ్డు ప్రమాదాల్లో 480 మంది మృతి

- January 05, 2017 , by Maagulf
'న్యూ ఇయర్' రోడ్డు ప్రమాదాల్లో 480 మంది మృతి

న్యూ ఇయర్ సెలవుల్లో థాయిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 480 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటిలో చాలా వరకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగినవేనని తెలిపింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో థాయిలాండ్ రోడ్లు కూడా ఒకటి. డ్రంకెన్ డ్రైవింగ్‌పై థాయిలాండ్ ప్రభుత్వం 2014 నుంచి ఉక్కుపాదం మోపుతున్నా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పులేదు. గతేడాది న్యూ ఇయర్ సెలవుల్లో 380 మంది మృతి చెందగా ఈసారి ఆ సంఖ్య 478 మందికి చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com