భారతరత్నజయలలితకు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ......
- January 06, 2017
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ప్రకటించేలా కేంద్రాన్ని సూచిన ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో కేంద్రానికి తాము ఎలాంటి సూచనలు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అమ్మకు భారత రత్న ఇవ్వాలని, పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలంటూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కోరారు. అలాగే పలు దఫాలుగా లేఖలు సైతం రాశారు. పార్లమెంటులో జయలలిత విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించలేదు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా వివరణ ఇవ్వడంతో మున్ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









