విమానాశ్రయంలో కాల్పులు: ఐదుగురి మృతి....

- January 06, 2017 , by Maagulf
విమానాశ్రయంలో కాల్పులు: ఐదుగురి మృతి....

ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ విమానాశ్రయంలో శుక్రవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. రెండో టెర్మినల్‌ వద్ద లగేజీ తనిఖీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com