అమెరికాలో 'సంఘమిత్ర' గ్రాఫిక్స్ పనులు..
- January 07, 2017
ఓ చరిత్రాత్మక చిత్రాన్ని రూపొందించాలని దర్శకుడు సుందర్.సి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరనుంది. ఆ భారీ బడ్జెట్ చిత్రమే 'సంఘమిత్ర'. దీన్ని శ్రీతేనాండాల్ ఫిలిమ్స్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఈ పరిణామంతో సుందర్.సి ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇందులో జయంరవి, ఆర్యలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇతర నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన సెట్ వేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీని చిత్రబృందం సందర్శించింది. సాధారణ చిత్రీకరణకు ముందుగానే గ్రాఫిక్స్ పనులను సుందర్. సి ఆరంభించారు.
గ్రాఫిక్స్‌కు చిత్రంలో కీలక స్థానం ఉన్నట్లు సమాచారం. ఆరు నెలలుగా అమెరికాలో ఈ పనులు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ కొనసాగనుంది. ఈ చిత్రం కోసం ఏప్రిల్‌లో కళాదర్శకుడు సాబుసిరిల్ భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









