సిరియాలో కారు బాంబు పేలుడు, 14మంది మృతి

- January 07, 2017 , by Maagulf
సిరియాలో కారు బాంబు పేలుడు, 14మంది మృతి

సిరియాలోని అజాజ్‌లో జలహాబ్‌ అనే సెంటర్‌లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానికులు ధ్రువీకరించారు. ఈ పట్టణం టర్కీ సరిహద్దు సమీపంలో ఉంది. సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ లెక్కల ప్రకారం ఈ దాడిలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే సెంటర్‌లోని కోర్టు ప్రాంగణం ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను అలెప్పోలోని మెడికల్‌ క్యాంప్‌కు తరలించారు. ఈ ప్రాంతంపై ఇటీవలే ఐసిస్‌ పట్టుపెంచుకుంటోంది. రష్యా మధ్య వర్తిత్వంతో జరిగిన సంధికి గండి కొట్టేందుకు ఈ పేలుడు జరిపినట్లు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com