మరో దారుణానికి తెగబడ్డ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
- January 07, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఇరాక్‌లో తమ ఆధీనంలో ఉన్న మోసుల్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సమాచారం చేరవేసాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని సోపు నీళ్లలో ముంచి చంపివేశారు. వందలాది ప్రజలు చూస్తుండగా నిందితుడిని సోపు నీళ్లతో నిండిన ఈత కొలనులో ముంచివేశారు. గతంలోనూ కొందర్ని అనుమానంతో ఇలాగే చంపివేసిన విషయాలు తెలిసిందే. బతికిఉండగానే మంటల్లో వేసేయడం, భవంతులపై నుంచి తోసివేయడం, శిలువ వేయడం...తదితర ఉన్మాద చర్యలతో సామాన్యులను భయోత్పాతానికి గురిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17న ఇరాకీ ప్రభుత్వ దళాలు, కుర్దు దళాలు అమెరికా వాయుసేన సహకారంతో మోసుల్ విముక్తికి పోరాటం ప్రారంభించాయి. ఇప్పటికే మోసుల్‌లోని పలు ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఐఎస్ ప్రాబల్యం కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని ఐఎస్‌ను తుదముట్టిస్తామని ఇరాకీ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







